చెట్టుకింద మాదకద్రవ్యాలను దాచిపెట్టిన అక్రమ రవాణాదారులు
- March 04, 2018
దుబాయ్: చిటారు కొమ్మన మిఠాయి పొట్లం మాదిరిగా ..కొందరు నిందితులు మాదక ద్రవ్యాలను ఓ చెట్టు కింద ఎవరకి తెలియకుండా దాచిపెట్టారు. అయితే, వాటిని పాతాళంలో దాచిపెట్టినా గల్ఫ్ పోలీసులు వెలికి తీస్తారు. నిందితులను న్యాయస్థానంలో నుంచోబెడతారు. ఆ తర్వాత కఠినమైన శిక్షలు అమలుచేస్తారు. శనివారం మాదకద్రవ్య నిరోధక శాఖ విభాగ అధికారులు ఆసియా దేశాలకు చెందిన నలుగురు మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులను పట్టుకున్నారు. దుబాయ్‌లోని ఓ ప్రాంతంలో భారీగా దాచిపెట్టిన డ్రగ్స్‌ను కనుగొన్నారు. 91.7 కేజీల కాప్టాగోన్ అనే మాధకద్రవ్యాల మాత్రల రూపంలో సర్దుకొని ఆ సంచులను ఓ చెట్టుకింద రహస్యంగా భద్రపరిచారు. వీరి అక్రమ చర్యలను రహస్యంగా గమనించిన నిఘా అధికారులు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరించి ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకొన్నారు.. చెట్టుకింద దాచిన డ్రగ్స్‌ను బయటకు తీస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహిం అల్ మన్సూరి వెల్లడించారు. ఈ కేసుపై న్యాయస్థానం విచారణ జరపనుందని, నలుగురు నిందితులు జైలుశిక్ష తప్పదని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







