వల విసిరి పావురాల దొంగతనం
- March 05, 2018
కువైట్ : స్థానిక షామియా ప్రాంతంలో పిక్ అప్ ట్రక్కు లోంచి దిగిన ఓ యువకుడు తనను ఎవ్వరూ చూడటం లేదని నిర్ధారించుకొని వాహనంలో ఉన్న వలని ఒడుపుగా పావురాల మీదకు విసిరేడు. వలలో చిక్కిన ఆ పావురాలను ఒడిసి పట్టుకొని ఆ ట్రక్కులో తుర్రుమన్నాడు. అయితే ఈ తతంగతమంతా వీడియో రికార్డ్ కాబడటంతో పర్యావరణ పోలీసులు పావురాలు దొంగిలించిన వ్యక్తి కోసం అన్వేషించారు. ఆ యువకుడు దొంగతనానికి ఉపయోగించిన పికప్ ట్రక్ ఒక వృద్ధునికి చెందినదని, త్వరలో యువకుడి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ కేసులో ఆ యువకుడికి జరిమానా 500 కువైట్ దినార్ల లేదా ఒక సంవత్సరం జైలు శిక్ష నిందితుడికి విధించవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







