237 మంది అక్రమ వలసదారులను రక్షించిన లిబియా నౌకాదళ సిబ్బంది

- March 11, 2018 , by Maagulf
237 మంది అక్రమ వలసదారులను రక్షించిన లిబియా నౌకాదళ సిబ్బంది

ట్రిపోలీ: లిబియా వైపు అక్రమంగా ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన బోటులో వున్న దాదాపు 237 మందిని తమ నౌకాదళ సిబ్బంది సురక్షితంగా తీరానికి చేర్చారని లిబియా ప్రభుత్వం ప్రకటించింది. లిబియా వైపు రెండు బోట్లలో అక్రమంగా తరలి వస్తున్న దాదాపు 237 మంది ప్రయాణీకులను లిబియాలోని అజ్‌ జవాఇయా తీర ప్రాంతంలో నీట మునగకుండా సురక్షితంగా తీరానికి చేర్చినట్లు అధికార అనడోలు వార్తా సంస్థ వెల్లడించింది. 44 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులతో వున్న ఈ వసలదారుల బృందంలో అధికశాతంమంది ఆఫ్రికాకు చెందిన వారేనని, ఒకరిద్దరు బంగ్లాదేశ్‌కు చెందిన వారుండవచ్చని ఈ ప్రకటనలో వివరించారు. వారికి వైద్య సదుపాయంతో పాటు అవసరమైన మానవతా సాయం కూడా అందచేస్తున్నామని ఈ ప్రకటనలో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com