ప్రత్యర్థిపై గెలిచిన రాములయ్య.. దర్శకుడు ఎన్.శంకర్
- March 11, 2018
ఎన్కౌంటర్, శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం, యమజాతకుడు, ఆయుధం, జైబోలో తెలంగాణ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న సుప్రసిద్ధ దర్శకుడు ఎన్. శంకర్ ఆదివారం (మార్చి 11) తెలుగు చలన చిత్ర దర్శకుల మండలి ఎన్నికల్లో ప్రముఖ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి సానా యాదిరెడ్డిపై 310 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శంకర్‌తో పాటు పలువురు సినీరంగానికి చెందిన వ్యక్తులు ప్యానల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా శ్రీకాంత్ అడ్డాల, అనిల్ రావిపూడి, ప్రియదర్శిని, గంగాధర్, అంజిబాబు, మధుసూధన్ రెడ్డి, కృష్ణమోహన్, కృష్ణబాబు, చంద్రకాంత్ రెడ్డి విజయం సాధించారు. రెండు సంవత్సరాల పాటు ఈ నూతన కార్యవర్గం పదవిలో కొనసాగుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







