మే 17న రమదాన్: ఉపవాసం రోజులో 13 గంటలు
- March 11, 2018
పవిత్ర రమదాన్ మే 17న ప్రారంభం కానుంది. వేసవి సీజన్ కావడంతో ఉపవాస సమయం 13 గంటల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సార్జా సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ స్పేస్ సైన్సెస్ ఇబ్రహీమ్ అల్ జర్వాన్ మాట్లాడుతూ, పవిత్ర రమదాన్ మాసానికి సంబంధించి న్యూ మూన్ గురువారం, మే 13 మధ్యాహ్నం 3.48 నిమిషాలకు (యూఏఈ టైమ్) ప్రారంభం కానుంది. అదే రోజు సాయంత్రం సన్సెట్కి కొద్ది నిమిషాల ముందు అంతర్ధానమవుతుంది. మే 16 బుధవారం సన్సెట్ తర్వాత మాత్రమే న్యూ మూన్ కనిపిస్తుంది. దాంతో గురువారం మే 17 రమదాన్ తొలి రోజు అవుతుంది. ఉపవాసం 13.25 గంటలపాటు ఉంటుంది. రమదాన్ మాసం ముగిసే సమయానికి ఇది 15 గంటలకు చేరుకోనుంది. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయనీ, 41 డిగ్రీల వరకు చేరుకుంటాయనీ, అత్యల్ప ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. జూన్ 14 సాయంత్రం చంద్ర దర్శనాన్ని బట్టి రమదాన్ పండుగ నిర్ధారణ జరుగుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







