బర్త్ డే స్పెషల్..ఇంస్టాగ్రామ్ కు ఎంట్రీ ఇచ్చిన అమీర్ ఖాన్..

- March 13, 2018 , by Maagulf
బర్త్ డే స్పెషల్..ఇంస్టాగ్రామ్ కు ఎంట్రీ ఇచ్చిన అమీర్ ఖాన్..

విలక్షణ నటుడు అమీర్ ఖాన్ జన్మించి నేటికి 53 ఏళ్లు. ఈ సందర్భంగా అభిమానులకు మరింత చేరువ కావాలని అమీర్ భావించాడు. ఇన్ స్టాగ్రామ్‌లో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇప్పటికే ఫేస్ బుక్‌, ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో టచ్‌లో ఉంటున్న అమీర్ మరొక సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ఇన్ స్టాగ్రామ్ ద్వారా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవాలని భావిస్తున్నాడు.
 
ఇప్పటికే సోషల్ మీడియాలో 37 మిలియన్ యూజర్లను కలిగి ఉన్న అమీర్ ఖాన్ . ఫొటో షేరింగ్ ఫ్లాట్ పామ్ ద్వారా ఎప్పటి కప్పుడు తన గురించి అప్‌డేట్స్ అందించేందుకు నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ అనే చిత్రం షూటింగ్‌లో అమీర్ ఖాన్ పాల్గొంటున్నాడు. జోధ్‌పూర్ లో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
 
1965 మార్చి 14న జన్మించిన అమీర్ ఖాన్ బాల నటుడిగా 1973లో యాదోంకీ బారాత్ చిత్రంలో నటించాడు. ఆ తర్వాత 1984లో హోలీ అనే ఓ చిత్రంలో నటించాడు. 1988 నుంచి పూర్తిస్థాయి నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
 
ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాడు. తన విలక్షణ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే నైపుణ్యాన్ని సంపాదించుకున్నాడు. కోట్లాది ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. భారతదేశంతో పాటు చైనా, పాకిస్థాన్ దేశాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పొందాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com