న్యూజిలాండ్లో ఎగిరే టాక్సీలు!
- March 15, 2018
న్యూజిలాండ్‌లో పైలట్ రహిత ఎగిరే టాక్సీలను పరీక్షిస్తున్నారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ ఈ ప్రాజెక్టుకు మద్దతిస్తున్నారు. ఈ ట్యాక్సీలతో ప్రజా రవాణా రంగంలో విప్లవం వస్తుందని మద్దతుదారులు పేర్కొంటున్నారు. పేజ్ కంపెనీ కిట్లీ హాక్ అనుబంధ సంస్థ అయిన జిఫిర్ ఎయిర్‌వర్క్స్ ఎయిర్ ట్యాక్సీలను అభివృద్ధిపరిచి, పరీక్షించే ప్రణాళికకు న్యూజిలాండ్ అధికారులు ఆమోద ముద్ర వేశారు. కోరాగా పిలిచే ఈ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు రెక్కలపై చిన్న లిఫ్ట్ రూటర్లు వుంటాయి. దీంతో, ఈ ఎయిర్‌క్రాఫ్ట్ నిట్ట నిలువుగా టేకాఫ్ తీసుకోగలుగుతుంది. హెలికాప్టర్ మాదిరిగా ల్యాండ్ అవుతుంది. పట్టణప్రాంతాల్లో ఇండ్ల పైకప్పులను, కార్ పార్కింగ్ ప్రాంతాలను ల్యాండింగ్ పాడ్‌లుగా ఉపయోగించుకుంటూ అక్కడ మాత్రమే ప్రయాణికులను రవాణా చేయగలుగుతుందని డెవలపర్లు చెబుతున్నారు. ఈ టాక్సీల నుండి ఎలాంటి కాలుష్యం వెలువడదని, రవాణా రంగంలో ఇదొక అద్భుతమైన దశ అని జిఫిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రెడ్ రెయిడ్ చెప్పారు. కోరా నమూనాను న్యూజీలాండ్‌లోని దక్షిణ దీవిలో పరీక్షిస్తున్నారు. ఈ వాహనంలో మూడు కంప్యూటర్లు వుండి ప్రయాణ మార్గాన్ని నిర్దేశిస్తాయి. ఎగిరే టాక్సీల్లో ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించవచ్చు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







