నేపాల్ లో గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్ శిక్షణకు బషీర్
- March 19, 2018
ఈనెల 21 నుండి 23 వరకు నేపాల్ రాజధాని ఖాట్మండు లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి గల్ఫ్ వలసల భాగస్వామ్య వ్యూహాల శిక్షణకు వరంగల్ జిల్లాకు చెందిన తమ సంస్థ సభ్యుడు మహ్మద్ బషీర్ అహ్మద్ కు ఆహ్వానం అందిందని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంద భీంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా పనిచేసే 'డిప్లొమసి ట్రేనింగ్ ప్రోగ్రాం', ఫిలిప్పీన్స్ లోని మనీలా కేంద్రంగా పనిచేసే 'మైగ్రంట్ ఫోరమ్ ఇన్ ఏసియా', నేపాల్ లోని ఖాట్మండు కేంద్రంగా పనిచేసే నేషనల్ నెట్ వర్క్ ఫర్ సేఫ్ మైగ్రేషన్ అనే మూడు సంస్థలు సంయుక్తంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
ఓమాన్ దేశంలోని మస్కట్ లో 12 సంవత్సరాలపాటు ఉపాధ్యాయులుగా పనిచేసిన బషీర్ హైదరాబాద్ లో స్థిరపడ్డారు. తెలంగాణ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం (తెలంగాణ ప్రవాసి వేదిక) లో రిటర్నుడు ఓవర్సీస్ ప్రొఫెషనల్స్ (విదేశాల నుండి వాపస్ వచ్చిన నిపుణులు) విభాగానికి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు.
గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్ (గల్ఫ్ కు వలసలు వెళుతున్న ప్రాంతాలు) లో పనిచేసే సివిల్ సొసైటీ అడ్వొకేట్స్ (పౌరసమాజ సమర్థకులు) ఆలోచన, సమీక్ష కార్యక్రమంలో భాగంగా శిక్షణ ఇవ్వడానికి వివిధ దేశాల నుండి పలువురు వలస కార్మిక నాయకులు, సమాజ సేవకులను ఆహ్వానించారు. కార్మికులను పంపే దేశాలు, కార్మికులను స్వీకరించే దేశాల మధ్య సమర్థవంతమైన వలసల భాగస్వామ్య వ్యూహాలపై ప్రధానమైన చర్చ జరుగుతుంది.
తాజా వార్తలు
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట