వ్యక్తిగత ఖర్చులపై సౌదీ యువరాజు వ్యాఖ్యలు
- March 19, 2018
రియాద్: సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విలాసవంతంమైన, దుబారాతో కూడిన వ్యక్తిగత జీవితం గురించి మీడియా ప్రస్తావించినప్పుడు ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. తనకున్న సంపద పూర్తిగా తన వ్యక్తిగత వ్యవహారమని ఆయన తేల్చిచెప్పారు. తన వ్యక్తిగత ఖర్చులకు సంబంధించినంత వరకు తాను సంపన్నుడే గానీ పేదవాడిని కాదని ఆయన స్పష్టం చేశారు. ఇలా చెబుతూ చెబుతూనే తాను మహాత్మా గాంధీనో లేక నెల్సన్ మండేలానో కాదని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఓ వ్యక్తిగా తన వ్యక్తిగత ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలపై ఖర్చు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తన ఆదాయంలో కనీసం 51 శాతం పేదప్రజలపై మరో 49 శాతం తన కోసం ఖర్చు చేస్తానని బిన్ చెప్పుకొచ్చారు. కాగా, ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన నివాసమైన 'ఫ్రెంచ్ కోట'కు బిన్ యజమాని అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!