ప్రియురాలి క్షేమం కోసం ...సూపర్ మాన్ కాబోయి బ్యాండేజ్ మాన్ అయిన ఓ యువకుడు
- March 19, 2018
దుబాయ్: " కామాతురాణాం..నభయం ..నలజ్జ " అని మన పెద్దలు ఊరికే అనలేదు ..దుబాయిలో ఓ యువకుడు (19) అక్షరాలా అది నిజం చేశాడు. ప్రేమ పైత్యం రెండు అంతస్తుల భవనంపై నుంచి కిందకు దూకేలా చేసింది . ఫలితంగా ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. " మా కుటుంబ సభ్యులంతా ఉదయం ప్రార్థనల్లో పాల్గొనేందుకు మసీదుకు వెళ్లారని ఇంట్లో ఎవరూ లేరని ..ఇంటికి వస్తే బాగా ఖుషి చేద్దామని " ఆహ్వానించిన ప్రియురాలిని ఏకాంతంగా కలిసేందుకు షార్జా లోని ఆమె ఇంటికి రెప్పపాటులో చేరుకొన్నాడు. వారు ఇరువురు జోరుగా ప్రేమించుకొంటున్న వేళ..కొద్దిసేపటికే వారిద్దరూ గదిలో ఉండగానే.. ప్రియురాలి తండ్రి ఆకస్మికంగా ఇంటిలోనికి రావడంతో ఆ యువకుని కథ తిరగబడింది. ప్రియురాలి తండ్రి వారు ఉంటున్న గదివైపు వేగంగా రావడం...వెలుపలకు వెళ్లేందుకు ఏకైక మార్గం ఉండటంతో .ప్రియురాలి తండ్రి నుంచి తన్నులు తప్పించుకునేందుకు ఆ ప్రియుడికి ఏం చేయాలో అర్ధం కాక మరో దారి లేక..భవనంపై నుంచి సూపర్ మాన్ మాదిరిగా కిందకు దూకేసాడు. దాంతో కాళ్ళు చేతులు నడుంక తీవ్ర గాయాలై కిందపడి గిల గిల కొట్టుకొంటున్న ఆ ప్రియుడిని స్థానికులు షార్జా ఆసుపత్రిలో చేర్పించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







