ఆశ్చర్య పరుస్తున్న కోనవెంకట్ భారీ ఫ్యాకేజ్
- December 01, 2015
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కార్పోరేట్ హాడావిడి ఎక్కవుగా నడుస్తుంది. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు ఎక్కువుగా కార్పోరేట్ వారు నిర్మిస్తున్న సినిమాలే కావటం విశేషం. రిలయన్స్, పివిపి సంస్థలు ముఖ్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెజార్టీ వాటాను దక్కించుకోవాటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. రిలయన్స్ ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన టాప్ హీరోల మూవీలలో భారీ పెట్టుబడులను పెట్టింది. అంతే కాకుండా ఫాంలో ఉన్న వారితో కాంబో డీల్ అగ్రిమెంట్స్ వంటివి చేస్తుంది. ఇందులో భాగంగానే పలు సినిమాల విజయాలతో దూసుకుపోతున్న కోన వెంకట్ తో రిలయన్స్ 3 సినిమాల అగ్రిమెంట్స్ ని కుదుర్చుకుంది. ఈ విషయంపై కోన మాట్లాడుతూ 'శంకరాభరణం సినిమా రిలీజైన తరువాత ఫిలిం మేకింగ్ ను సీరియస్ గా తీసుకుంటాను. ఓ నిబద్దత ఉన్న నిర్మాతగా మారతాను. అలాగే వచ్చే సంవత్సరం కనీసం 3 సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను. నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నన్ను భాగస్వామిని చేసుకోవాలనుకుంటోంది. నేను క్రియేటివిటీపై దృష్టి పెడితే వాళ్ళు బడ్జెట్ సంగతి చూసుకుంటారు' అని అన్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన డీల్ వ్యవహారం పూర్తిగా అయిపోయిందనే టాక్స్ వినిపిస్తున్నాయి. రిలయన్స్, కోనవెంకట్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలకి కోనవెంకట్ భారీ ఫ్యాకేజ్ ని దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కోనవెంకట్ కి రిలయన్స్ నుండి దాదాపు 50 కోట్ల రూపాయల ప్యాకేజ్ అందినట్టుగా తెలుస్తుంది. ఆ 3 చిత్రాలకు కోనవెంకట్ దర్శకుడిగా, రచయితగా పనిచేయనున్నాడు. ఇక ఈ మూవీల అనుకున్న దాని కంటే లాభాలను సాధిస్తే...అందులోనూ 10 శాతం వాటాను కోనకి ఇవ్వనున్నట్టుగా అగ్రిమెంట్స్ జరిగాయని క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. అందుకే కోన వెంకట్ ఈ మధ్య కాలంలో మీడియాకి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారాడు. ప్రస్తుతం రిలయన్స్ సంస్థ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'నాన్నకు ప్రేమతో' సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరిస్తుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







