మ్వసలాత్‌ బస్సులకు పెరుగుతున్న ఆదరణ

- December 01, 2015 , by Maagulf
మ్వసలాత్‌ బస్సులకు పెరుగుతున్న ఆదరణ


మస్కట్‌లో ప్రయాణీకులకు లగ్జరియస్‌ జర్నీ తక్కువ ఖరీదుతో అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రయాణం పట్ల ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మ్వసలాత్‌ తీసుకొచ్చిన కొత్త బస్సులు ప్రయాణీకుల్ని బాగా ఆకర్షిస్తున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ బస్సులు లగ్జరియస్‌ జర్నీని అందిస్తున్నాయని ప్రయాణీకులు అంటున్నారు. ట్యాక్సీని ఆశ్రయిస్తే 800 బైజా ఖర్చయ్యేదనీ, అదే ఈ బస్సుల్లో ప్రయాణం కేవలం 300 బైజాకే అందుతోందని ప్రయాణీకులు చెప్పారు. అయితే ప్రయాణీకుల వాదనలకు భిన్నంగా ట్యాక్సీ డ్రైవర్లు మ్వసలాత్‌ బస్సులపై తమ ఆవేదనను చెబుతున్నారు. ఈ బస్సుల రాకతో తమకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయనీ, ట్యాక్సీ నడపడం ద్వారా తమ తమ కుటుంబాల్ని నడుపుతున్న తమకు, ప్రయాణీకులు లేక ఆర్థిక కష్టాలు పెరిగిపోయాయని అన్నారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకూ ఉచితంగా బస్సులు నడిపిన మ్వసలాత్‌ ఇక నుంచి ఛార్జీలను వసూలు చేస్తోంది. సోమవారం నుంచి ఈ ఛార్జీలను అమల్లోకి తీసుకువచ్చారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com