రోడ్డు ప్రమాద మరణాల్లో సౌదీ అరేబియా 'టాప్'
- December 03, 2015
గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు సంబంధించి ట్రాఫిక్ సంబంధిత మరణాల్లో సౌదీ అరేబియా మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో ఒమన్ నిలిచినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. సౌదీ అరేబియా లక్ష మందికిగాను 27.7 మరణాలు నమోదవుతోంటే, ఒమన్‌లో లక్ష మందికిగాను 25.4 మరణాలు జరుగుతున్నట్లు తేలింది. అయితే రాయల్ ఒమన్ పోలీసులు మాత్రం, రోడ్డు ప్రమాద మరణాలు 2012తో పోల్చితే 2013లో తగ్గాయనీ, 2014లో ఇంకా తగ్గాయనీ, 2015లో మరణాల సంఖ్య చాలా తక్కువగా నమోదయ్యిందని చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచడంతో 2012లో 8209 మరణాలు సంభవించగా, ఆ సంఖ్య 2015కి వచ్చేసరికి 4,937కి తగ్గినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వివరించారు. అతివేగమే ప్రమాదాలకు ముఖ్య కారణమని వారు చెప్పారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







