వెన్ను నొప్పి నివారణ మార్గాలు..
- December 03, 2015
బ్యాక్ పెయిన్(వెన్ను నెప్పి) సర్వ సాధారణం.నిజం చెప్పాలంటే 80 శాతం మంది ఎప్పుడో ఒకప్పుడు దీనితో బాధపడతారు.బ్యాక్ పెయిన్ లక్షణాలు అందరిలో ఒకేలాగ ఉండవు.కొంతమందిలో ఈ నెప్పి బాగా ఉంటే కొంత మందిలో తక్కువగా ఉంటుంది.బ్యాక్ పెయిన్ కి సంబంధించిన అపోహలు, నిజాలు తెలుసుకుందామా. కుర్చీలలో వంగి కూర్చోవడం మన వెన్ను కి మంచిది కాదని తెలుసు. కానీ నిటారుగా కూర్చోవడం కూడా వెన్ను కి చేటే. ఒక బరువు ఎత్తేతప్పుడు ఎత్తే వస్తువు బరువు కన్నా మీరు దానిని ఎలా ఎత్తుతున్నారనేదే ముఖ్యం.ఏదైనా వస్తువు ని ఎత్తేటప్పుడు దానికి వీలయినంత దగ్గరగా ఉండి గొంతుకు కూర్చుని ఎత్తండి. ఎత్తేటప్పుడు వంగటం లేదా ఒక్కసారి గా కదలడం లాంటివి చెయ్యకండి. బెడ్ రెస్ట్ తీవ్ర వెన్ను నెప్పి లేదా గాయాలనుండి కోలుకోవడం లో సహాయపడుతుంది.కానీ పూర్తిగా బెడ్ రెస్ట్ వల్ల తగ్గుతుంది అన్నది అపోహే.ఒక్కోసారికదలక మెదలక అలా మంచం లో ఉండటం మీ వెన్ను నెప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. శరీరం బరువు పెరిగితే వెన్ను నొప్పి కూడా పెరుగుతుంది శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడం వల్ల వెన్ను నెప్పి ని నివారించవచ్చు లేదా మరింత ముదరకుండా చేయచచ్చు. శారీరకం గా ఫిట్ గా లేని వాళ్ళు లేదా స్థూలకాయులలో వెన్ను నెప్పి సర్వసాధారణం.వారాంతాలలో మాత్రమే వ్యాయామం చేసే(వీనెండ్ వారియర్స్) లో వెన్ను నెప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. బాగా బలహీనం గా ఉన్నవారిలో వెన్ను నెప్పి అవకాశాలెక్కువ. ముఖ్యం గా సరిగా తినకపోవడమనే రుగ్మత(ఈటింగ్ డిజార్డర్ ) మరియు ఆస్టియోపోరోసిస్ ఉన్నవారిలో వెన్ను నెప్పి వచ్చే అవకాశం మరింత అధికం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వెన్ను నెప్పిని నివారించవచ్చు.వెన్ను నెప్పి తీవ్రం గా ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో చేసే తేలికపాటి వ్యాయామాలు మంచివి.మొదట తేలికగా ఉండే వ్యాయామాలతో మొదలెట్టి మెల్లిగా తీవ్రత ని పెంచుకుంటూ పోవాలి. యదార్ధం: చిరోప్రాక్టిక్ వెన్ను నెప్పి కి బాగా ఉపయోగం. స్పైనల్ మానిప్యులేషన్ (స్పైనల్ అభిసంధానం )లేదా మసాజ్ లు వెన్ను నెప్పి నివారణకి ఉపయోగకర మార్గాలు. మిగతా ట్రీట్మెంట్ల వల్ల లొంగని వెన్ను నెప్పులు ఆక్యూపంక్చర్ విధానం లో తగ్గుముఖం పడతాయి.యోగా, రిలాక్సేషన్,కాగ్నిటివ్ బెహావియోరల్ థెరపీలు (అభిజ్ఞా ప్రవర్తన చికిత్స) కూడా ఉపయోగకరమే. వెన్ను నెప్పి ఉంటే పరుపు ఎంత గట్టిగా ఉండాలి అన్న విషయాన్ని అనేకమంది అనేక రకాలుగా చెప్తారు. స్పెయిన్ లో జరిపిన ఒక అధ్యయనంలో మధ్యస్త గట్టిదనం ఉన్న పరుపు(5.6 నుండి 10 పాయింట్లు హార్డ్ స్కేల్ లో)మీద పడుకున్న వాళ్ళలో వెన్ను నెప్పి మరీ గట్టి గా ఉన్న పరుపు(2.3 పాయింట్లు) మీద పడుకున్న వారి కంటే తక్కువ ఉంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









