విశాల్ వరద బాధితుల కష్టాలను చూసి కంటతడి..
- December 06, 2015
సినీ నటులు విశాల్, సిద్ధార్థలో చెన్నై వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారు స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శనివారం విశాల్ బాధితుల కష్టాలను చూసి చలించి, కంటతడి పెట్టారు. అన్ని ప్రాంతాలు చక్కబడేంత వరకు షూటింగులను పక్కన బెట్టి సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. విశాల్ బృందంలో ఏకంగా 50 మందికి పైగా చేరి నగరవ్యాప్తంగా ఆహారపొట్లాలు, తాగునీరు, బ్రెడ్ ప్యాకెట్లు అందిస్తున్నారు. కాగా, విశాల్ తెలుగువాడైన విషయం తెలిసిందే. విశాల్ ఐదు రోజులుగా బాధితుల సేవలో ఉన్నారు. బాధితులను ఆదుకునేందుకు ఓ వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి ఆ సభ్యులందరి ఇళ్లలోను వంటలు చేసి, వాటిని ఒక్కో ప్రాంతానికి వాహనాల్లో తీసుకు వెళ్లి పంపిణీ చేస్తున్నారు. విశాల్‌తో పాటు హీరో సిద్ధార్థ్ కూడా సహాయం చేస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు ప్రాంతాల్లో వ్యాధుల భయం చెన్నైలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరదకు తోడు వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇక్కడ జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలుగు ప్రజలు నివాసం ఉంటే కొన్ని ప్రాంతాల్లో సహాయక సహకారాలు సక్రమంగా అందటం లేదని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మాధవరం, ఆర్కేనగర్ కాలనీలోని కొరుక్కుపేట తదితర ప్రాంతాల్లో తెలుగువారు వేలాది మంది ఉంటారు. కుళాయిల్లో కార్పోరేషన్ నీళ్లు రంగుమారి వస్తున్నాయి. గత్యంతరం లేక తాగుతున్నారు. పలు స్వచ్చంద సంస్థలు, తెలుగు సంఘాలు అందించే వితరణ పైన ప్రస్తుతం ఈ ప్రాంత వాసులు ఆశ్రయం పొందుతున్నారు
తాజా వార్తలు
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్‌లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ