20 గంటలకు పైగా ఫాస్టింగ్ ఈ దేశంలో!
- May 18, 2018
ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాసం ఉంటారు. అయితే వివిధ దేశాల్లో సమయం అటూ ఇటూగా వుంటుంది. కొన్ని దేశాల్లో ఉపవాసం సుమారు 21 గంటలు ఉంటే, మరికొన్ని దేశాల్లో కేవలం 11 గంటలు మాత్రమే ఫాస్టింగ్ చేయాల్సి వస్తుంది. ఐస్లాండ్లోని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో 21 గంటలపాటు లాంగెస్ట్ ఫాస్టింగ్ అక్కడ తప్పనిసరి. పిన్లాండ్లో 19 గంటలపాటు ఫాస్టింగ్ సమయం తప్పదు. చిలీలో అత్యల్ప సమయం మాత్రమే ఫాస్టింగ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడి ఫాస్టింగ్ టైమ్ కేవలం 10 గంటల 33 నిమిషాలు మాత్రమే. బ్రెజిల్ మరియు ఆస్ట్రేలియా 11 గంటల 59 నిమిషాలు కాగా, యూఏఈలో 14 గంటల 52 నిమిషాలు ఉపవాస సమయం వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







