కేంబ్రిడ్జి అనలిటికా దివాలా పిటిషన్ దాఖలు
- May 18, 2018
వాషింగ్టన్ : బ్రిటన్‌కి చెందిన రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ కేంబ్రిడ్జి అనలిటికా దక్షిణ న్యూయార్క్ జిల్లాలో గురువారం దివాలా పిటిషన్ దాఖలు చేసింది. దాదాపు 8.7కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఇటీవల ఈ సంస్థ డేటా కుంభకోణంలో చిక్కుకుంది. కేంబ్రిడ్జి అనలిటికా ఎల్‌ఎల్‌సి తన ఆస్తులను లక్ష డాలర్ల నుండి ఐదు లక్షల డాలర్లవరకు పేర్కొనగా, అప్పులను మాత్రం పది లక్షల డాలర్ల నుండి కోటీ డాలర్ల వరకు పేర్కొంది. తమ కంపెనీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని, సంస్థను మూసివేస్తామని ఈ నెల ప్రారంభంలోనే ప్రకటించింది. సంస్థను ఇలా మూసివేయడానికి కారణం తమపై మీడియా ప్రతికూల ప్రచారమేనని పేర్కొంది. ఆన్‌లైన్ అడ్వర్జయిజ్‌మెంట్‌లో భాగంగా న్యాయపరంగా ఆమోదించబడిన తమ కార్యకలాపాల వల్ల అవమానాల పాలయ్యామని పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







