సౌదీ అరేబియా టూ కామారెడ్డి: ప్రేమించినవాడి కోసం వచ్చేసిన యువతి
- June 01, 2018
హైదరాబాద్: అతను సౌదీలో ఓ కారు డ్రైవర్.. ఆమె ఓ బడా కుటుంబానికి చెందిన గారాలపట్టీ.. ఆ కారు డ్రైవర్ నడవడిక చూసి ఆమెకు అతనిపై ప్రేమ కలిగింది. అదే మాట అతనితో చెబితే.. ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయపడ్డాడు. కానీ అన్నింటికి తానే ముందుండి ఎట్టకేలకు ఆమె అతన్నే వివాహం చేసుకుంది. ఇందుకోసం పుట్టిన గడ్డ సౌదీని సైతం వదిలి ఇండియా వచ్చేసింది. సినిమాల్లో ప్రేమ కథలను తలపిస్తున్న ఈ కథ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
సౌదీ టూ కామారెడ్డి ఏంటీ ప్రేమ కథ
కామారెడ్డికి చెందిన అజీబుద్దీన్ అనే యువకుడు బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. అక్కడ నసీర్ అనే ఓ బడా వ్యాపారి వద్ద కారు డ్రైవరుగా చేరాడు. ఇదే క్రమంలో అజీబుద్దీన్ నడవడిక నసీర్ కూతురిని ఆకర్షించింది. అతన్ని ప్రేమించింది. మొదట ఆ విషయం అజీబుద్దీన్ తో చెప్పినప్పుడు అతను చాలా కంగారుపడ్డాడు. నీకు నాకు సెట్ కాదనే చెప్పాడు. కానీ ఆమెనే అతనికి ధైర్యం చెప్పించి ఒప్పించింది.
ఇద్దరి వివాహం ముందు అతన్ని పంపించి..
సౌదీలో ఉంటే ఇద్దరు పెళ్లి చేసుకోవడం కష్టం కాబట్టి ఇండియా వచ్చేయాలనుకున్నారు. ఈ క్రమంలో మొదట ఆ యువతి.. అజీబుద్దీన్ ను ఆర్నెళ్ల క్రితం ఇండియా పంపించింది. దీంతో అతను తన స్వస్థలమైన కామారెడ్డికి చేరుకున్నాడు. ఆ తర్వాత స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి.. ఆమె కూడా ఇండియా వచ్చేసింది.
నేపాల్ టూ ఇండియా గత నెలలో నిఖా
సౌదీ నుంచి నేరుగా ఢిల్లీ విమానశ్రయంలో దిగితే తన తండ్రికి తెలిసినవారు గుర్తుపడుతారని యువతి భావించింది. దీంతో సౌదీ నుంచి నేపాల్ వెళ్లి అక్కడినుంచి ఇండియాలో అడుగుపెట్టింది. ఢిల్లీ చేరుకున్నాక అజీబుద్దీన్ కి ఫోన్ చేసి తాను వచ్చిన విషయం చెప్పింది. దీంతో అతను ఢిల్లీ వెళ్లి ఆమెను కామారెడ్డికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో గత నెల రెండో వారంలో వారిద్దరు 'నిఖా' చేసుకున్నారు.
తండ్రికి ఫోన్ లో కేసు పెట్టిన తండ్రి..
వివాహం తర్వాత యువతి తన తండ్రికి ఫోన్ ద్వారా విషయం చేరవేసింది. దీంతో హైదరాబాద్ చేరుకున్న నసీర్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అజీబుద్దీన్ తనను కిడ్నాప్ చేయలేదని ఇష్టపూర్వకంగానే నిఖా జరిగిందని యువతి పోలీసులతో తెలిపింది. పైగా వారిద్దరు మేజర్లు కావడంతో బలవంతంగా తీసుకురావడం కుదరదని నసీరుద్దీన్కు చెప్పారు. దీంతో చేసేదేమి లేక ఆమె తండ్రి వెనుదిరిగినట్టు సమాచారం.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







