400 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై..!!

- June 07, 2018 , by Maagulf
400 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై..!!

దేశవ్యాప్తంగా ఉన్న 400 రైల్వేస్టేషన్లో ఉచిత వైఫై సేవలు అందించనున్నట్లు గూగుల్ ప్రకటించింది. రైల్‌టెల్‌ సహకారంతో ప్రముఖ టెక్‌ సంస్థ గూగుల్‌ ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఈరోజు అసోంలోని దిబ్రుగఢ్‌ రైల్వేస్టేషన్‌లో ఉచిత వైఫై ని ఏర్పాటు చేశారు. దీంతో ఇక దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లలో ఈ వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చిందని గూగుల్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2016 జనవరిలో ఈ ఉచిత వైఫై సేవలకు శ్రీకారం చుట్టారు. రైల్వేశాఖకు చెందిన టెలికాం విభాగం రైల్‌టెల్‌ సహాకారంతో గూగుల్‌ రైల్వేస్టేషన్లలో వైఫై రూటర్లను ఏర్పాటుచేస్తోంది. మొదటిసారి ముంబై సెంట్రల్‌ స్టేషన్లో ఈ ఉచిత వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రాజెక్టును చేపట్టిన ఏడాది కాలంలోనే 100 పెద్ద రైల్వేస్టేషన్‌లలో వైఫైను ఏర్పాటుచేశారు.ఇప్పుడది 400కు చేరింది. దీంతో స్టేషన్లకు వచ్చే ప్రయాణికులు 30 నిమిషాల పాటు ఉచితంగా ఇంటర్నెట్‌ ను వాడుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com