దుబాయ్:ఎయిర్ పోర్ట్ వినియోగదారులకి రోడ్ క్లోజర్ హెచ్చరిక
- June 07, 2018
దుబాయ్: దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ అధికారులు, ట్రావెలర్స్‌కి రోడ్ క్లోజర్స్పై హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు టెర్మినల్ 1 నుంచి గర్హౌడ్ లేదా దుబాయ్ వెళ్ళే రహదారిపై బ్రిడ్జి మూసివేయబడ్తుంది. కొత్త గాంట్రే రోడ్ సైన్ ఏర్పాటు కోసం ఈ రోడ్డుని మూసివేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించుకుని విమాన ప్రయాణీకులు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూసుకోవాలని పేర్కొంది. రష్దియా వైపుగా రోడ్ సైన్స్‌ని ఫాలో అవ్వాల్సి వుంటుంది. టెర్మినల్ 1 నుంచి ఎగ్జిట్ అయ్యాక, ఈ రోడ్ సైన్స్ ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. విలా 41తొ స్ట్రీట్, కసబ్లాంకా స్ట్రీట్ నార్త్ బౌండ్, ఆ తర్వాత యూ టర్న్ తీసుకుని ఎయిర్ పోర్ట్ రోడ్ని వినియోగించుకుని కసబ్లాంకా సౌత్ బౌండ్ నుంచి వెళ్ళాలి. రోడ్డు మూసివేత దాదాపుగా 4 గంటల పాటు అమల్లో వుంటుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో రోడ్డు యాక్సెస్‌లోకి వస్తుంది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







