బిగ్‌బాస్2 గురించి ఆసక్తికర విషయాలు..!
- June 10, 2018
అందరి చూపులు ఇవాళ్టినుంచి(ఆదివారం) ప్రారంభంకానున్న బిగ్‌బాస్2 పైనే ఉన్నాయి. గత సీజన్ లో హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ కాకుండా ఈ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడిదే ఆసక్తికరంగా మారింది. అరపేజీ డైలాగును అవలీలగా చెప్పేసే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్‌బాస్1 ను రక్తికట్టించాడు.
ఎన్టీఆర్ బిగ్‌బాస్ చేయడంతో ఈ షోకి మంచి పాపులరీటి వచ్చింది. పైగా తన సహజ నటనతో షోని జనాలలోకి తీసుకెళ్లడంతో వెండితెర పైనే కాకుండా బుల్లితెరపై కూడా సూపర్‌స్టార్‌నే అని నిరూపించుకున్నాడు. ఈ షోలో, కంటెస్టెంట్లతో టీవీ ద్వారా కన్పించిన ఎన్టీఆర్, దాదాపు వారిని ఎంటర్‌టైన్ చేశాడు.
మొదటి షో రేటింగ్స్ కూడా టాప్‌లో ఉండటంతో రెండవ సీజన్‌కు కూడా ఎన్టీఆరే హోస్ట్ గా వ్యవహరిస్తాడని అందరు అనుకున్నారు కానీ అనూహ్యంగా నాచురల్ స్టార్ నాని తెరపైకి వచ్చాడు. వాస్తవంగా హీరో నానీకి యాంకర్ అన్న పదం కొత్తేమి కాదు.. గతంలో నానికి రేడియో జాకీగా మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉంది. అంతేకాదు మంచి స్పాంటినిటీ కూడా ఉందని గ్రహించి బిగ్‌బాస్2 హోస్ట్‌గా ఎంపిక చేశారట.
ఇక బిగ్‌బాస్2 ప్రోమోను చాలా ఆసక్తికరంగా రూపొందించారు. గ్యాంగ్ స్టర్ కోపంతో హోస్ట్ ఎవడురా? ఇంకా ఎన్నాళ్లు వెయిట్ చేయాలిరా అంటూ ఓ వ్యక్తికి తుపాకి గురిపెట్టి వార్నింగ్ ఇస్తుంటాడు. ఇంతలో నాని అన్నా అంటూ ఓ పిల్లాడు పరుగెత్తుకొంటూ వస్తాడు. అచ్చం ఎన్టీఆర్ లానే నాని చేసినా ఈ ప్రోమోకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇక 100 రోజుల పాటు జరిగే బిగ్‌బాస్2 కి కంటెస్టెంట్లు కూడా ఆసక్తికరంగా మారారు..ఇప్పటికే అనధికారికంగా తెలుస్తున్న సమాచారం మేరకు బిగ్‌బాస్2 లో హీరోలు.. రాజ్ తరుణ్, తనీశ్, వరుణ్ సందేశ్, ఆర్యన్ రాజేశ్, తోపాటు సింగర్ గీతా మాధురి, యాంకర్ శ్యామల, సీనియర్ నటి రాశి, చార్మి, గజాలా, చాందినీ చౌదరి, ధన్య బాలకృష్ణన్, జూనియర్ శ్రీదేవి, వైవా హర్ష, కమెడియన్ వేణుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







