హరీష్ శంకర్ చేతుల మీదుగా 'శంభో శంకర' టీజర్ రిలీజ్
- June 10, 2018
షకలక శంకర్ హీరోగా, శ్రీధర్ ఎన్ దర్శకునిగా రూపొందుతున్న చిత్రం శంభో శంకర. వై.రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై టీజర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శంకర్ ఆఫీస్ బాయ్ స్థాయి నుండి ఈ స్థాయికి ఎదిగాడు. గబ్బర్‌సింగ్ సక్సెస్‌లో శంకర్ పాత్ర కూడా ఉంది. శంభోశంకర్ చిత్రాన్ని 35 రఈజుల్లో పూర్తిచేయడం అంత సులువుకాదు. ఈ విషయంలో దర్శక, నిర్మాతలను యూనిట్‌ను అభినందిస్తున్నాను అన్నారు.
నిర్మాత వై.రమణారెడ్డి మాట్లాడుతూ సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది అని అన్నారు.
నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ మంచి కథతో శంకర్, చిత్ర దర్శకుడు శ్రీధర్ నా దగ్గరకు వచ్చారు. కథ నచ్చడంతో నిర్మాణంలో భాగస్వామి అయ్యాను. నేను శంకర్‌తో మరికొన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది అని అన్నారు.
సినిమా బాగా వచ్చిందని చెప్పడం కంటే సినిమా ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది అని చిత్ర దర్శకుడు శ్రీధర్ చెప్పారు. శంకర్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా చేశాను. సాయికార్తీక్ మంచి బాణీలు ఇచ్చారు అని అన్నారు.
హీరో శంకర్ మాట్లాడుతూ నేను పవన్ కల్యాణ్‌గారిని మనసులో పెట్టుకునే పనిచేశాను. అందుకే ఈ స్థాయికి ఎదిగాను. నేను బరువు తగ్గడానికి రెండేళ్ళు సినిమాలు లేకపోవడమే కారణం. అలాంటి సమయంలో ఈ సినిమా అవకాశం వచ్చింది అని అన్నారు. శంకర్, కారుణ్య, నాగినీడు, అజయ్ ఘోష్, ప్రభు, ఏడిద శ్రీరామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు భవానీ ప్రసాద్, ఛాయాగ్రహణం రాజశేఖర్, సంగీతం సాయికార్తీక్.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







