బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా యన్‌.టి.ఆర్ ఫస్ట్ లుక్

- June 10, 2018 , by Maagulf
బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా యన్‌.టి.ఆర్ ఫస్ట్ లుక్

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న బయోపిక్ 'యన్.టి.ఆర్' ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఇంతకముందే ఓసారి బయోపిక్ లుక్ చేశారు చిత్ర యూనిట్‌.కాని చిత్ర దర్శకుడు తేజ సినిమా నుండి తప్పుకోవడంతో సినిమాలోకి దర్శకుడు క్రిష్ వచ్చి చేరాడు.దీంతో బయోపిక్ సంబంధించి మరో ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.ఈ లుక్ చూసిన వారందరు ఇందులో క్రిష్ మార్క్ కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

'తన నూరవ చిత్రంలో అమ్మ పేరు ధరించి కూస్తంత మాతృరుణం తీర్చుకున్న బసవ రామ తారక పుత్రుడు, ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృరుణాన్ని కూడా తీర్చుకుంటున్న తారక రామ పుత్రుడు, శతాధిక చిత్ర 'నటసింహం', నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు' అని 'యన్.టి.ఆర్' చిత్ర దర్శకుడు క్రిష్ పేర్కొన్నారు.ఈ బయోపిక్‌ను బాలయ్యే స్వయంగా నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com