అబుదాబీలో రేస్‌-3 షూటింగ్‌: హీరోయిన్‌ జాక్వెలైన్‌ కంటికి గాయం

అబుదాబీలో రేస్‌-3 షూటింగ్‌: హీరోయిన్‌ జాక్వెలైన్‌ కంటికి గాయం

బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ ఓ సినిమా షూటింగ్‌లో గాయపడింది. శ్రీలంకకి చెందిన జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెల్సిందే. ఈ భామ 'రేస్‌-3' సినిమా షూటింగ్‌ కోసం అబుదాబీలో చక్కర్లు కొట్టింది. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఆమె కంటికి గాయమయ్యింది. చిన్న గాయం కాదిది. ఈ గాయం కారణంగా ఆమె కంటి ఐరిస్‌ రూపం కోల్పోయింది. ఇది పర్మనెంట్‌ గాయమనీ, అయినాసరే, 'రేస్‌-3' సినిమాకి సంబంధించి ఇది ఒక గొప్ప మెమరీగా గుర్తుండిపోతుందని జాక్వెలైన్‌ వెల్లడించింది. 'రేస్‌-3' సినిమాని యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రెమో డిసౌజా డైరెక్టర్‌. సల్మాన్‌ఖాన్‌తో జాక్వెలైన్‌కి ఇది రెండో సినిమా. 

Back to Top