పంచదార గవ్వలు..

- May 08, 2015 , by Maagulf
పంచదార గవ్వలు..

ఈరోజు ఒక మంచి స్నాక్ పరిచయం చేస్తున్నాం. చాల సులువుగా అవ్వటమే కాక చాల రోజులు నిలువ ఉండే స్నాక్..

 

కావలసిన పదార్ధాలు:

  • మైదా           - 1 కప్పు
  • పంచదార      - 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ
  • నూనె            - వేయించటానికి సరిపడా
  • నెయ్యి          - 2 స్పూన్లు

 

చేయు విధానం:

  • ముందుగా 4 స్పూన్ల నూనెను బాగా వేడి చేసి మైదా లో వేసి కలపండి. ఇప్పుడు కొంచెం కొంచం నీళ్ళు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి.
  • ఈ ముద్దనుంచి చిన్నచిన్న ముక్కలు తీసుకొని గవ్వల చెక్కతో గానీ, ఏదైనా నొక్కులు ఉన్న డబ్బా మూతతో నొక్కి పెట్టుకోవాలి.
  • ఈ ముక్కలను పేపర్ మీద ఒక 5 నిమిషాలు ఆరబెట్టి, నూనెలో బంగారు రంగు వచ్చే దాకా వేయించుకోండి.
  • ఈలోపు స్టవ్ మీద పక్కన ఒక గిన్నెలో పంచదార వేసి అది మునిగేదాకా నీళ్ళు పోసి ముదురు పాకం వచ్చేదాకా మరిగించండి. అంటే పాకం నీళ్ళల్లో వేస్తే, చుక్కగా ఉండాలి అప్పుడు పాకం ముదురు అయిందని అర్ధం.
  • ఈ పాకంలో నెయ్యి, వేయించిన గవ్వలు వేసి పాకం అన్నిటికి అంటేదాకా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పంచదార గవ్వలు రెడీ!!..

 

 

                                ---- సి.లీల కుమారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com