716 బిలియన్ డాలర్ల డిఫెన్స్ బిల్లుపై ట్రంప్ సంతకం
- August 14, 2018
వాషింగ్‌టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 716 బిలియన్ డాలర్ల రక్షణ శాఖ బిల్లును మిలిటరీపై చట్టబద్దంగా ఖర్చు చేయటంపై సంతకం చేశారు.ఈ బిల్లుపై సంతకం చేసేముందు ఫోర్ట్‌డ్రమ్‌లో న్యూయార్క్ నార్తర్న్ మిలిటరీ బేస్ వద్ద సెనేటర్ జాన్ మెక్ కెయిన్ పేరు లేవనెత్తకుండా మాట్లాడారు,ఈ సెనేటర్ మాజీ ప్రెసిడెన్సియల్ నామినీ అని, పార్టీలో ట్రంప్‌ను విమర్శించేవారు. ఈ బిల్లులో 616.9 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను పెంటగాన్ బేస్‌పై, 21.9 బిలియన్ డాలర్లను న్యూక్లియర్ వెపన్స్‌పై, 69 బిలియన్ డాలర్స్‌ను వార్ ఫండింగ్ కు కేటాయించారు. అంతేగాక 2.6 శాతం మిలిటరీ సభ్యులను పెంచుకోవడానికి 13 కొత్త నేవీ వార్‌షిప్స్‌ను,77ఎఫ్-35 జాయింట్ Zసైకర్ జెట్స్‌ను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ బిల్లు ముందుగా సెనేట్‌లో ఆగష్టు 1న అమోదం పొందిందని, తరువాత హౌస్ లో అమోదం పొందుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా సెనేట్, హౌస్‌లలో నేషనల్ డిఫెన్స్ అథరైజేషన్ యాక్ట్ ప్రకారం అమోదం పొందుతుందని, కమిటీలు ఏర్పరచి వాటి ద్వారా వేటికి ఎంత ఫండ్ ఇవ్వాలో నిర్ణయిస్తారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







