రోడ్డు ప్రమాదంలో చిన్నారికి గాయాలు
- September 19, 2018
మస్కట్: నాలుగేళ్ళ చిన్నారి, పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. సీబ్ ప్రాంతంలో ఎస్యూవీ ఒకటి ఈ చిన్నారిని ఢీకొంది. చిన్నారి అవాస్ అల్ మహ్రామి, ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలవగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. బీచ్ పక్కనే తండ్రితో కలసి కూర్చున్న ఆవాస్, ఒక్కసారిగా రోడ్డు పైకి వెళ్ళడంతో, దాన్ని అతని తండ్రి యూసిఫ్ అల్ మహ్రామి వెంటనే గుర్తించలేకపోయారు. రోడ్డుపై ప్రమాదం తాలూకు శబ్దం వినగానే అటువైపు వెళ్ళిన ఆవాస్ తండ్రికి, ఆవాస్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుసుకున్నారు. చిన్న చిన్న గాయాలతో ఆవాస్ బయటపడ్డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు చిన్నారి ఆవాస్కి. ఒక్కసారిగా రోడ్డుపైకి చిన్నారి రావడంతో వాహనాన్ని అదుపు చేయడానికి ఎస్యూవీ డ్రైవర్ చాలా కష్టపడ్డాడు. ఆదివారం షార్జా ప్రాంతంలోని సీబ్ బీచ్ వద్ద ఉదయం 11 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







