ఢిల్లీలో విషాదం.. భవనం కూలి 5 మంది మృతి..

- September 26, 2018 , by Maagulf
ఢిల్లీలో విషాదం.. భవనం కూలి 5 మంది మృతి..

ఢిల్లీ:ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. శిధిలావ్యవస్థలో ఉన్న ఓ భవనం కూలడంతో ఐదుగురు మృతిచెందారు. మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాయువ్య ఢిల్లీలోని అశోక్‌ విహార్‌ ఫేజ్‌3లో ఉదయం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టారు. శిథిలాల కింద ఇరుక్కున్న వారిని బయటికి తీసేందుకు ఆరుగురితో కూడిన రెస్క్యూ టీమ్‌ పనిచేస్తోంది. కాగా ఈ ఘటనలో ఓ మహిళ సహా నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతి చెందిన మహిళను మున్నీగా గుర్తించారు. ఇదిలావుంటే ఈ భవనం 20 ఏళ్ల క్రితం నాటిదని, శిథిలావస్థకి చేరుకోవడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com