ముద్దు గొడవ: స్కూల్‌ నుంచి విద్యార్థి బహిష్కరణ

- October 30, 2018 , by Maagulf
ముద్దు గొడవ: స్కూల్‌ నుంచి విద్యార్థి బహిష్కరణ

దుబాయ్‌లోని ఓ స్కూల్‌లో విద్యార్థి అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతన్ని స్కూల్‌ నుంచి బహిష్కరించారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ పబ్లిక్‌ స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థి, సహ విద్యార్థిని ముద్దాడుతూ దాన్ని వీడియో తీసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, ఇందుకు కారకుడైన విద్యార్థిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. విచారణ జరిపిన అనంతరం మినిస్ట్రీ, ఆ బాలుడ్ని స్కూల్‌ యాజమాన్యం సస్పెండ్‌ చేసేలా ఆదేశాలు జారీ చేసింది. లెవల్‌ ఫోర్‌ ఉల్లంఘనగా దీన్ని నమోదు చేశారు. సెక్సువల్‌ అబ్యూస్‌ సహా పది ముఖ్యమైన నిబంధనల ఉల్లంఘనల్లో దేనికి పాల్పడినా స్కూల్‌ నుంచి విద్యార్థిపై కఠిన చర్యలుంటాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com