మోడీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామంటున్న సౌదీ మంత్రి
- December 07, 2018
వియన్నా/న్యూఢిల్లీ : క్షీణిస్తున్న చమురు ధరలను నియంత్రించేందుకు వీలుగా చమురు ఉత్పత్తిని తగ్గించడంపై నిర్ణయం తీసుకోవడానికి ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ వంటి ప్రపంచ నేతల అభిప్రాయాలను ఒపెక్ పరిగణనలోకి తీసుకుంటుందని సౌదీ చమురు శాఖ మంత్రి ఖలీద్ అల్ ఫలీ తెలిపారు. ప్రపంచంలోనే చమురు వినియోగంలో మూడవ అతిపెద్ద దేశం భారత్. దేశ ఇంధన అవసరాలు తీర్చేందుకు 80శాతంపైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఒపెక్ సమావేశం నేపథ్యంలో విలేకర్లతో మాట్లాడుతూ సౌదీ చమురు శాఖ మంత్రి ఖలీద్, జి-20 సమావేశం సందర్భంగా బ్యూనస్ ఎయిర్స్‌లో మోడీని కలిశామని, ఆయన తన అభిప్రాయాలు చాలా స్పష్టంగా చెప్పారని, తమ దేశ వినియోగదారుల ప్రయోజనాల పట్ల చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలిపారు. చమురు ధరలు అధికంగా పెరిగేలా నిర్ణయాలను ఒపెక్ తీసుకోబోదని ఆశిస్తున్నట్లు ఒపెక్ సమావేశానికి ముందు ట్రంప్ ట్వీట్ చేశారు. దానిపై ఖలీద్ స్పందిస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద వినిమయ దేశమైన అమెరికా అలా ఆశించడంలో పొరపాటు లేదని అన్నారు. అతిపెద్ద వినిమయ దేశాలు వాస్తవంగా సమావేశాల్లో పాల్గొనకపోయినా ఒపెక్ చర్చల్లో భాగస్వాములై వుంటాయని అన్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







