బాడీ బిల్డింగ్‌లో బహ్రెయిన్‌ డబుల్‌ గోల్డ్‌

బాడీ బిల్డింగ్‌లో బహ్రెయిన్‌ డబుల్‌ గోల్డ్‌

బహ్రెయిన్‌ ఎలైట్‌ బాడీ బిల్డర్స్‌ 2018 ఐఎఫ్‌బిబి వరల్డ్‌ మాస్టర్‌ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటారు. స్పెయిన్‌లోని టర్రాగోనాలో ఈ పోటీలు జరిగాయి. మొహమ్మద్‌ సుబాహ్‌ 45-49 ఇయర్స్‌ 90 కిలో విభాగంలో గోల్డ్‌ సాధిస్తే, అలి అల్‌ ఖయ్యాత్‌, 45-49 ఇయర్స్‌ 70 కిలోల విభాగంలో గోల్డ్‌ సాధించారు. సయెద్‌ హమ్జా అల్‌ హుస్సైని, క్లాసిక్‌ ఫిజిక్‌ ఓవర్‌ 45 ఇయర్స్‌ విభాగంలో బ్రాంజ్‌ పతకాన్ని దక్కించుకున్నారు. ఈ టీమ్‌కి సుప్రీమ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ అసిస్టెంట్‌ సెక్రెటరీ జనరల్‌, బహ్రెయిన్‌ ఒలింపిక్‌ కమిటీ సెక్రెటరీ జనరల్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ అస్కర్‌, బిఓసి బోర్డ్‌ మెంబర్‌ షేకా హయాత్‌ బింట్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ ఖలీఫా, బిఓసి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌జలీల్‌ అసద్‌, బహ్రెయిన్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఫెడరేటషన్‌ ప్రెసిడెంట్‌ సుల్తాన్‌ అల్‌ ఘానెమ్‌ ఘనస్వాగతం పలికారు. 

Back to Top