ఇరాక్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఆకస్మిక పర్యటన

- December 27, 2018 , by Maagulf
ఇరాక్‌లో  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఆకస్మిక పర్యటన

బాగ్దాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. క్రిస్మస్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆయన సతీసమేతంగా ఆకస్మిక పర్యటన చేపట్టారు. అత్యంత రహస్యంగా ఇరాక్ వెళ్లిన ఆయన అక్కడ అమెరికా బలగాలను కలిశారు. సిరియా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి దళాలను ఉపసంహరిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన తర్వాత.. ట్రంప్ ఈ పర్యటన చేపట్టడం విశేషం. మరోవైపు అమెరికా ప్రభుత్వం స్తంభించిన సమయంలో ట్రంప్ ఆకస్మిక పర్యటనకు వెళ్లడం ఎవరికీ అర్థం కావడం లేదు. ఇరాక్‌లోని అల్ అసద్ ఎయిర్ బేస్‌లో ట్రంప్‌.. అమెరికా సైనికులను కలిశారు. అక్కడ వారిని ఉద్దేశించి మాట్లాడారు. సిరియా నుంచి వైదొలుగుతున్న విషయాన్ని ఆయన వారితో చెప్పారు. శాశ్వతంగా సిరియాకు వెళ్లాలన్న ఉద్దేశంతో మనం అక్కడకు వెళ్లలేదని, కేవలం మూడు నెలల టార్గెట్‌తో వెళ్లామని, కానీ ఎనిమిదేళ్లు అయినా అక్కడే ఉన్నామని, అందుకే దళాలను ఉపసంహరిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. భార్య మిలానీయాతో కలిసి ఇరాక్ వెళ్లిన ట్రంప్‌.. సిరియాలో మరో ఆరు నెలల ఉండాలని మిలిటరీ కమాండర్లు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చారు. ఇరాక్ నుంచి తిరుగు ప్రయాణంలో ట్రంప్‌.. జర్మనీలో ఉన్న అమెరికా సైనికులను కూడా కలిశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com