అచ్రేకర్ అంత్యక్రియలు: క్రికెట్ బ్యాట్లతో నివాళి
- January 03, 2019
బుధవారం తుదిశ్వాస విడిచిన ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ విఠల్ అచ్రేకర్ అంత్యక్రియలు ముంబయిలో జరిగాయి. ఆయన భౌతిక కాయానికి ప్రముఖ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, వినోద్ కాంబ్లీ నివాళులర్పించారు. రమాకాంత్ అచ్రేకర్ ముంబయి దాదర్ ప్రాంతంలో ఉన్న శివాజీ పార్కులో యువ క్రికెటర్లకు కోచింగ్ ఇచ్చేవారు.
శివాజీ పార్క్ మైదానానికి అచ్రేకర్ భౌతిక కాయాన్ని తీసుకెళ్లారు. అక్కడ అనేక మంది యువ క్రికెటర్లు బ్యాట్లు పట్టుకుని 'అచ్రేకర్ అమర్ రహే' అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ తుది వీడ్కోలు పలికారు. సచిన్ తెండూల్కర్‌కు చిన్నతనంలో శిక్షణ ఇచ్చిన అచ్రేకర్.. మరెంతో మంది యువకులను తీర్చిదిద్దారు.
ముంబయి క్రికెట్ జట్టుకు సెలక్టర్‌గా కూడా వ్యవహరించారు. క్రికెట్ క్రీడకు అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను ద్రోణాచార్య, పద్మశ్రీ పురస్కారాలతో గౌరవించింది. ''సర్ (అచ్రేకర్) ఎల్లప్పుడూ నా హృదయంలోనే ఉంటారు. ఆయనతో నా అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేను" అని సచిన్ చెబుతుంటారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!