అబుదాబిలో ప్రముఖ రోడ్‌ మూసివేత

అబుదాబిలో ప్రముఖ రోడ్‌ మూసివేత

అబుదాబి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (డీవోటీ), అల్‌జహీయా ప్రాంతంలో జాయద్‌ ఫస్ట్‌ స్ట్రీట్‌ని జనవరి 5 నుండి 7 వరకూ మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. సోషల్‌ మీడియాలో డీవోటీ ఈ మేరకు ఓ మ్యాప్‌ని పోస్ట్‌ చేసింది. ఇంటర్‌సెక్షన్‌ అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకూ శని, ఆది వారాల్లో మూసి వేయబడుతుంది. రైట్‌ లేన్‌ ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకూ మూసి వేయబడుతుంది. మోటరిస్టులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని డిపార్ట్‌మెంట్‌ సూచనల్ని పరిగణనలోకి తీసుకోవాలని ట్రాఫిక్‌ రూల్స్‌ తప్పక పాఠించాలని అధికారులు పేర్కొన్నారు.

Back to Top