పోలీస్‌ అధికారులపై దాడి: ఇద్దరు హౌస్‌ మెయిడ్స్‌కి జైలు

పోలీస్‌ అధికారులపై దాడి: ఇద్దరు హౌస్‌ మెయిడ్స్‌కి జైలు

హై క్రిమినల్‌ కోర్టు, ఇద్దరు హౌస్‌మెయిడ్స్‌కి ఏడాది జైలు శిక్ష విధించింది. మహిళా పోలీస్‌ అధికారిపై ఈ ఇద్దరు మహిళలు దాడి చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. న్యాయస్థానం ఈ మేరకు నిందితులకు జైలు శిక్ష విధించడం జరిగింది. నిందితుల్లో ఒకరు ఆసియాకి చెందిన వ్యక్తి కాగా మరొకరు, ఇథియోపియాకి చెందిన వ్యక్తి. రెసిడెన్స్‌ స్టేటస్‌పై విచారణ చేస్తుండగా మహిళా అధికారిపై వీరు దాడి చేశారు. ఇద్దరూ అక్రమంగా కింగ్‌డమ్‌లో నివసిస్తున్నారు. ఇథియోపియన్‌ మహిళ ఓ అధికారపై దాడి చేయగా, ఆసియాకి చెందిన మరో మహిళ, ఇతర మహిళా అధికారులపై దాడికి దిగినట్లు పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ పేర్కొంది. నిందితులు, బాధిత మహిళా అధికారిని, ఇతర అధికారుల్ని దుర్భాషలాడారు. నిందితులకు జైలు శిక్ష అనంతరం, వారిని డిపోర్టేషన్‌ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. 

 

Back to Top