మరో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం
- January 24, 2019
అద్భుతాలు సాధిస్తూ భారత కీర్తిని చాటుతున్న ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ-44 రాకెట్ ద్వారా రెండు చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు శాస్త్రవేత్తలు. బుధవారం అర్థరాత్రి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరనుంది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇప్పటి వరకు 45 ప్రయాగాలు పూర్తి చేసుకున్న ఇస్రో.. 46వ ప్రయోగానికి రెడీ అయ్యింది.
PSLV-C44 రాకెట్‌ను ఇస్రో బుధవారం రాత్రి 11 గంటల 37 నిమిషాలకు ప్రయోగించనుంది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ మంగళవారం రాత్రి 7.35 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 28 గంటలపాటు కొనసాగిన తరువాత PSLV- C44 నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఈ రాకెట్ ద్వారా తమిళనాడు హైస్కూల్ విద్యార్థులు రూపొందించిన కలాం శాట్‌తో పాటు మైక్రోశాట్-ఆర్ రెండు చిన్న ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. దీనికి సంబంధించి నిర్వహించిన రిహార్సల్ విజయవంతమైంది. గతంలో నింగిలోకి అధిక బరువుగల ఉపగ్రహాలను పంపేందుకు పీఎల్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ తరహాలో ఆరు స్ట్ఫ్రాన్ బూస్టర్లను అమర్చి పంపేవారు. ఉపగ్రహాల బరువు చాలా తక్కువ కావడంతో ప్రయోగ ఖర్చును తగ్గించేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు రెండు స్ట్రాపాన్ బూస్టర్లతోనే ప్రయోగం చేస్తున్నారు.
సాధారణంగా PSLV వాహక నౌకకు నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లు ఉంటాయి. PSLV-C44లో రెండు స్ట్రాపాన్ బూస్టర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో దీన్నిPSLV-DLగా పిలుస్తున్నారు. వాహక నౌకలోని పీఎస్4 దశను కక్ష్యలో కొన్ని ప్రయోగాల కోసం ఒక వేదికలా ఉపయోగించేందుకు అంతరిక్షంలోనే ఉంచనున్నారు. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీలు అమర్చారు. షార్ నుంచి ఈప్రయోగం 70వది కాగా పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో 46వ ప్రయోగంగా నమోదు అవుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







