ఎయిర్ ఇండియా వారి బంపర్ ఆఫర్
- January 26, 2019
గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియా జాతీయ, అంతర్జాతీయ ప్రయాణ టికెట్లపై ఆఫర్లు ప్రకటించింది. అన్ని పన్నులూ కలుపుకుని ఎకానమీ క్లాస్ టికెట్‌ను రూ.979 కనీస ధరకు విక్రయించనున్నట్లు తెలిపింది. నేటి నుంచి ఈ నెల 28 వరకు టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది.
కొనుగోలు చేసిన టికెట్లపై ఈ ఏడాది సెప్టెంబరు 30 లోగా ప్రయాణాలు చేసుకోవచ్చని వివరించింది. ఎయిరిండియా వెబ్‌సైట్, ఎయిర్ లైన్, సిటీ బుకింగ్ కార్యాలయాలు, కాల్ సెంటర్లు, ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ప్రాతిపదికన టికెట్ల కేటాయింపు జరుగుతందని తెలిపింది.
అదే బిజినెస్ క్లాస్‌లో అయితే టికెట్ ధర రూ.6,965 వరకు ఉంటుందని ఎయిర్ ఇండియా పేర్కొంది. అలాగే, అంతర్జాతీయ ప్రమాణాలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఎకానమీ క్లాస్‌లో రూ.55 వేలకే అమెరికాకు వెళ్లే అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు.
యూకే, యూరప్ సెక్టార్లకు రూ.32 వేలు, ఆస్ట్రేలియాకు ఎకానమీ క్లాస్‌లో రూ.50 వేలకే టికెట్లు ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తూర్పు, దక్షిణ ఆసియా ప్రాంతంలోని దేశాలకు రూ.11 వేలకు టికెట్ల ధరలు ఉన్నాయని.. ప్రయాణీకులు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







