వలసదారుడి జీవితాన్ని కాపాడిన ఎమిరేటీ మహిళ
- February 22, 2019అజ్మన్:ఓ వలసదారుడికి గుండె పోటు రాగా, అతన్ని రక్షించింది అజ్మన్‌లో ఓ ఎమిరేటీ మహిళ. దుబాయ్‌లోని వర్క్ ప్లేస్ నుంచి ఎమిరేటీ జాతీయురాలైన హింద్ అలి అల్ తహెరి వెళుతుండగా, ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతో బాధపడుతున్నట్లు గుర్తించారు. బాధపడుతున్న వ్యక్తికి సహకరించేందుకు మరో ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించినా వారి వల్ల కావడంలేదు. దాంతో ఎమిరేటీ మహిళ తన వాహనాన్ని ఆపి, అతన్ని బతికించేందుకు ప్రయత్నించారు. వెంటనే 998 (ఎమర్జన్సీ)కి కాల్ చేశారామె. పారామెడిక్ సిబ్బంది అందించిన సమాచారంతో, బాధితుడికి ప్రాథమిక వైద్య చికిత్స చేశారు. దాంతో బాధితుడు స్పృహలోకి వచ్చారు. ఈలోగా అంబులెన్స్ అక్కడికి చేరుకుని, బాధితుడ్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గతంలోనే తాను ఫస్ట్ ఎయిడ్ గురించి తెలుసుకోవడం వల్ల తగిన సమయంలో తక్షణ వైద్య సహాయం అందించగలిగినట్లు చెప్పారు అల్ తహెరి. వైద్యులు, అల్ తహెరి సమయస్ఫూర్తిని కొనియాడారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్