పుల్వామా ఎటాక్: అమెరికా లో భారతీయుల నిరసన
- February 23, 2019
పుల్వామా ఎటాక్ తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతీ భారతీయుడు పాకిస్తాన్ పై ఆగ్రహంతో రగిలలిపోతున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని ప్రవాస భారతీయులు కూడా పాకిస్తాన్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టెర్రర్ ఎటాక్ లో పాకిస్తాన్ ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ అమెరికాలోని న్యూయార్క్ లో పాకిస్తాన్ విదేశీ కార్యాలయాల వద్ద ప్రవాస భారతీయులు నిరసన వ్యక్తం చేశారు. 600 మందికి పైగా ప్రవాస భారతీయులు ఆందోళనలో పాల్గొన్నారు.
భారతీయ జెండాలను పట్టుకుని 'భారత్ మాతాకి జై' నినాదాలతో ప్రవాస భారతీయులు పాకిస్తాన్ విదేశీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అలాగే పాకిస్తాన్ ముర్దాబాద్, గ్లోబల్ టెర్రర్ పాకిస్తాన్, ఎల్ఈటీ పాకిస్తాన్, "9/11 పాకిస్తాన్," "26/11 పాకిస్తాన్, ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ అంటూ ప్లకార్డులపై రాసి ప్రదర్శించారు. "పాకిస్తాన్: ఏ టెర్రర్ నేషన్" అనే నినాదాన్ని వారు అమెరికాలోని పాకిస్తాన్ కన్సలేట్ ముందు గట్టిగా వినిపించారు.
ఈ కార్యక్రమం మొత్తం 600 మందితో ఫిబ్రవరి 22వ తేదీన జరగగా, అమెరికాలోని బీజేపీ సానుభూతి పరులు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. భారత మూలాలు కలిగిన ఉత్తర అమెరికన్లు కూడా ఆందోళనతో పాల్గొని పాకిస్తాన్ పై తమ గళం వినిపించారు. మెజారిటీ అసోషియన్లు.. బీహార్, జార్కండ్ అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(BAJANA), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్(TANA), ఈ ఆందోళనకు మద్దతు తెలిపాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







