భారతీయ వ్యక్తికి అండగా నిలిచిన యూఏఈ పోలీస్‌

- March 08, 2019 , by Maagulf
భారతీయ వ్యక్తికి అండగా నిలిచిన యూఏఈ పోలీస్‌

అజ్మన్ పోలీస్‌ కమ్యూనిటీ సపోర్ట్‌ సెంటర్‌, 60 ఏళ్ళ భారతీయ వ్యాపారవేత్తను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ, అనారోగ్య సమస్యలకు గురైన ఆ వ్యక్తికి పోలీసులు అండదండలందిస్తున్నారు. సెంటర్‌ డైరెక్టర్‌ కెప్టెన్‌ వాఫా ఖాలిద్‌ అల్‌ హౌసాని మాట్లాడుతూ, బాధిత వ్యక్తిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. బాధితుడు యూఏఈలో 35 ఏళ్ళుగా నివసిస్తున్నారు. అజ్మన్‌ అలాగే ఇతర ఎమిరేట్స్‌లో తన వ్యాపార కార్యకలాపాల్ని విస్తరించారు. అయితే అనుకోని కారణాలతో ఆస్తిని కోల్పోయి, తీవ్రమైన ఒత్తిడికి గురై, పెరాలసిస్‌తో బాధపడుతున్నారు. ఖలీఫా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అతనికి సాయంగా ఎ వరూ లేకుండా పోయారు. అజ్మన్‌లో ఇండియన్‌ కాన్సులేట్‌ని సంప్రదించి, అతన్ని స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com