కొబ్బరినూనెను తో లాభాలు
- March 11, 2019
కొబ్బరి నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తరుచు తీసుకోవడం వలన అధిక బరవు తగ్గొచ్చని చెప్తున్నారు. దాంతో థైరాయిడ్, డయాబెటిస్, గుండె వ్యాధుల నుండి విముక్తి లభిస్తుందని కూడా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇది నిజమో.. కాదో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరి నూనెను రోజూ కొంత మోతాదులో తాగడం వలన ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు. దీనిని ఆహారంలో భాగంగా చేసుకుంటే దాంతో బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. అయితే దీన్ని రోజూ ఎలా తీసుకోవాలలో చూద్దాం..
40 నుండి 60 కిలోల బరువు ఉన్నవారు నిత్యం 3 స్పూన్ల్ కొబ్బరినూనెను అలానే తాగవచ్చు. కానీ ఒకేసారి తాగకూడదు. ఉదయం, మధ్యహ్నం, రాత్రి భోజనానికి ముందు ఒక్కో స్పూన్ మోతాదులో తాగాలి. 81 కిలోల పైగా బరువు ఉన్నవారు నిత్యం 6 స్పూన్ల్ కొబ్బరినూనెను తాగవచ్చు. ఒక్కో పూట 2స్పూన్ల మోతాదులో భోజనానికి ముందు తాగాలి.
కొబ్బరినూనెను తాగడం వలన అందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ శరీర మెటబాలిజంను పెంచుతాయి. దాంతోపాటు థైరాయిడ్ సమస్యను తగ్గిస్తాయి. ముఖ్యంగా శరీరంలోని చెడు మలినాలను తొలగిస్తాయి.
కొబ్బరి నూనె ఏది పడితే అది తాగకూడదు. కేవలం ఎక్స్‌ట్రా వర్జిన్ లేదా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని దొరికే నూనె మాత్రమే వాడాలి. ఎందుకంటే ఇవే స్వచ్ఛమైన కొబ్బరినూనె కిందకు వస్తాయి. కొబ్బరి నూనెను మొదటిసారిగా తాగినప్పుడు వాంతి వచ్చినట్లు ఉంటుంది. సమస్య ఎక్కువైతే మాత్రం కొబ్బరినూనెను వాడకూడదు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







