షార్జాలో 40 కొత్త రాడార్లు
- January 01, 2016
షార్జాలో కొత్తగా 40 రాడార్లను ఇన్స్టాల్ చేసినట్లు ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. 2016 జనవరి 1 నుంచి ఈ రాడార్లు అందుబాటులోకి వచ్చాయి. రాడార్లను ట్రాఫిక్ సిగ్నల్స్‌గా వినియోగించడం ద్వారా రహదార్లపై ప్రమాదాల్ని తగ్గించడానికి వీలవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ని తొందరగా దాటెయ్యాలన్న ఉద్దేశ్యంతో సిగ్నల్స్ వద్ద అతి వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారనీ, కొత్త రాడార్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ద్వారా మోటరిస్టులకు ఉపకరిస్తూనే, రహదారిపై నడిచేవారికీ ప్రమాదాల నుంచి ఉపశమనం అందిస్తుందని అధికారులు చెప్పారు. రోడ్లపై ప్రమాదాలు తగ్గించడానికే ఈ కొత్త రాడార్ ట్రాఫిక్ సిగ్నల్స్‌ని ఏర్పాటు చేశామంటున్నారు అధికారులు. కొత్త రాడార్ల ద్వారా మోటరిస్టులకు ప్రమాదాలు, ఫైన్స్ చాలావరకు తప్పుతాయని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









