కాబూల్:24 మంది తాలిబన్ ఉగ్రవాదుల హతం..
- May 12, 2019
కాబూల్: అఫ్గానిస్థాన్ భద్రతా బలగాలు తమ దేశంలోని హేరాత్, పక్తీకా, గజనీ ప్రావిన్సుల్లో జరిపిన వైమానిక దాడుల్లో 24 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. అఫ్గాన్ మిలిటరీ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... 20 మంది తాలిబన్లను పక్తీకా ప్రావిన్సులోని జుర్మాత్, బెర్మాల్ జిల్లాల్లో హతమార్చారు. గజనీ ప్రావిన్సులోని అందర్ జిల్లాలో ఇద్దరు, హేరాత్ ప్రావిన్సులోని ఫర్సీ జిల్లాలో మరో ఇద్దరిని భద్రతా బలగాలు హతమార్చాయి. అఫ్గాన్ వ్యాప్తంగా తాలిబన్లు ఉగ్రవాద చర్యలను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలపై తాలిబన్లు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
తాలిబన్లు, ఐఎస్ ఉగ్రవాదుల చర్యల కారణంగా అఫ్గానిస్థాన్.. రాజకీయ అస్థిరత, సామాజిక, భద్రత సమస్యలను ఎదుర్కొంటోంది. దేశంలోని ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో ఇతర దేశాల భద్రతా బలగాల సాయంతో ఆఫ్గాన్ బలగాలు ఉగ్ర వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నాయి. హేరాత్, పక్తీకా, గజనీ ప్రావిన్సులతో పాటు హెల్మాంద్, ఉరుజ్గాన్, జాబూల్, నంగర్హర్ ప్రావిన్సుల్లోనూ భద్రతా బలగాలు ఉగ్రవాదుల శిబిరాలపై వైమానిక దాడులు జరుపుతున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







