ప్రముఖ నిర్మాత కన్నుమూత
- May 12, 2019
ప్రముఖ నిర్మాత వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. ఈ ఉదయం చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న వెంకట్రామిరెడ్డి ఉదయం అస్వస్థతకు గురై అనంతరం తిరిగిరాని లోకాలు వెళ్ళిపోయారు. విజయా సంస్థల అధినేత నాగిరెడ్డి కుమారుడైన వెంకట్రామిరెడ్డి ఆ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మాతగా వ్యవహరించారు. తమిళ సూపర్ స్టార్స్ అజిత్, విజయ్, విశాల్, ధనుష్‌లతో పలు చిత్రాలు తీశారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.తండ్రి బి.నాగిరెడ్డి పేరిట ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటులకు ప్రతియేటా పురస్కారాలను అందిస్తూ వచ్చారు. ఆయన మృతి పట్ల పలు సీని,రాజకీయ రంగ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







