యూఏఈలో ఇండియన్ పొలిటీషియన్ అరెస్ట్
- August 23, 2019
యూఏఈలో ఓ ఇండియన్ పొలిటీషియన్ అరెస్ట్ అయ్యారు. అజ్మన్‌లో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. తుషార్ వెల్లపల్లి అనే పొలిటీషియన్‌ని చీటింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్ ధర్మ జన సేన (బిడిజెఎస్) చీఫ్ తుషార్ వెల్లపల్లి, కేరళలోని వయనాడ్ నుంచి ఇటీవలి ఎన్నికల్లో నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ అభ్యర్థిగా రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. ఇది పూర్తిగా వ్యాపార సంబంధమైన విషయమనీ, రాజకీయాలతో ఈ అరెస్ట్‌కి సంబంధం లేదని అధికారులు అంటున్నారు. పదేళ్ళ క్రితం 11 మిలియన్ దిర్హామ్‌ల విలువైన చెక్‌ని ఆయన జారీ చేశారనీ, అది బౌన్స్ అయ్యిందని తెలుస్తోంది. కాగా, తన కుమారుడ్ని ట్రాప్ చేశారని తుషార్ తండ్రి వెల్లపల్లి నటేషన్ చెప్పారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







