ఇల్లీగల్‌ కార్‌ లిఫ్ట్‌ జరీమానాలపై డిస్కౌంట్‌ జూన్‌ 30 వరకు

- May 29, 2020 , by Maagulf
ఇల్లీగల్‌ కార్‌ లిఫ్ట్‌ జరీమానాలపై డిస్కౌంట్‌ జూన్‌ 30 వరకు

షార్జా:ఇల్లీగల్‌ ఆపరేషన్‌ ఆఫ్‌ వెహికిల్స్‌ - కార్‌ లిఫ్ట్స్‌కి సంబంధించి జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్‌ జూన్‌ 30 వరకు షార్జాలో వినియోగించుకోవచ్చునని షార్జా రోడ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఎస్‌ఆర్‌టిఎ) పేర్కొంది. ఎస్‌ఆర్‌టిఎ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌అజీజ్‌ అల్‌ జర్వాన్‌ మాట్లాడుతూ, ఉల్లంఘనలకు పాల్పడినవారు, ఈ డిస్కౌంట్‌ పీరియడ్‌ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. షార్జా రూలర్‌, సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ డాక్టర్‌ సుల్తాన్‌ ముహమ్మద్‌ అల్‌ కాసిమి డైరెక్టివ్స్‌ నేపథ్యంలో షార్జా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఈ డెసిషన్‌ని అమలు చేస్తోంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్చి 31 నుంచి జూన్‌ 30 వరకు ఈ డిస్కౌంట్‌ని అందుబాటులోకి తెచ్చారు. ఈ ఉల్లంఘనలకు సంబంధించి 5,000 దిర్హామ్లు జరీమానా విధిస్తున్నారు. ఉల్లంఘన రిపీట్‌ అయితే 10,000 జరీమానా విధిస్తున్నారు. కాగా, జరీమానాల్ని వెబ్‌సైట్‌ ద్వారా చెల్లించవచ్చు. ఇదిలా వుంటే, అల్‌ నౌమి, జరీమానాల డిస్కౌంట్‌ని వాహనదారులు వినియోగించుకోవడమే కాకుండా, రూల్స్‌ని పాటించాలని సూచించారు. ఎస్‌ఆర్‌టిఎ కాల్‌ సెంటర్‌ (600525252)కి సామాన్యులు ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చునని అధికార యంత్రాంగం చెబుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com