బంగారం దిగుమతులు: ట్యాక్స్‌ నిర్ణయం బ్యాక్‌ ఫైర్‌

- February 03, 2016 , by Maagulf
బంగారం దిగుమతులు: ట్యాక్స్‌ నిర్ణయం బ్యాక్‌ ఫైర్‌

బంగారం దిగుమతులకు సంబంధించి భారత ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనలు బెడిసికొడుతున్నాయి. అక్రమ బంగారం దిగుమతులు భారతదేశంలో పెరిగిపోతున్నాయి. ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా తయారైంది. ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోళ్ళు జరిపేవారికి సంబంధించి 'ట్యాక్స్‌ కోడ్‌' విధానాన్ని కేంద్రం తెరపైకి తెచ్చాక ఈ అక్రమ బంగారం రవాణా మరింతగా పెరిగిపోయింది. జనవరి 1 నుంచి 2,00,000 రూపాయల పైన విలువ చేసే బంగారం కొనదలచుకుంటే ప్యాన్‌ నంబర్‌, ట్యాక్స్‌ కోడ్‌ని సమర్పించవలసి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బంగారం వ్యాపారులూ అక్రమ బంగారం వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. పాన్‌ కార్డ్‌ లేని వినియోగదారులు కొనుగోళ్ళకు వెనుకాడుతుండడంతే బంగారం వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనివారి నుంచే బంగారం డిమాండ్‌ ఉంటోందని వ్యాపారులు చెబుతున్నారు. నిబంధనలెలా ఉన్నా, బంగారం కొనుగోళ్ళు తప్పడంలేదు. దాంతో అక్రమ బంగారం వినియోగానికే అవకాశాలెక్కువవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com