భారత్‌లో 26 లక్షల కరోనా కేసులు, 50 వేల మరణాలు నమోదు
- August 17, 2020
న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 57,982 కొత్త కేసులు నమోదడంతో మొత్తం కేసుల సంఖ్య 26 లక్షలు దాటింది. తాజాగా 941 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 50,921 కి చేరింది. తాజాగా నమోదైనవాటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26,47,664 కు చేరింది. ప్రస్తుతం 6,76,900 మంది వైరస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 19,19,843 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 7 లక్షల 30 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతో.. మొత్తం పరీక్షల సంఖ్య మూడు కోట్లు దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం వెల్లడించింది.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు