పోలీసులు సామాన్యుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి:టి.గవర్నర్

- August 17, 2020 , by Maagulf
పోలీసులు సామాన్యుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి:టి.గవర్నర్

హైదరాబాద్:ఐపిఎస్ అధికారులు, పోలీసులు సామాన్యుల రక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. శాంతి స్థాపనలో ప్రజల నమ్మకం పొందడం కీలకమన్నారు. 

గవర్నర్ ఈరోజు సాయంత్రం శిక్షణలో ఉన్న ఐదుగురు ప్రొబేషనరీ ఐపిఎస్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ నేరాల రూపు మారుతున్నదని, సైబర్ ప్రపంచంలో నేరాలు అధికమౌతున్నాయన్నారు. 

పోలీసులు సరికొత్త ఆధునిక టెక్నాలజీలతో సైబర్ నేరాలు అరికట్టాలి. ప్రజలను మోసాల బారిన పడకుండా కాపాడాని. టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు గవర్నర్. 

దేశ అంతర్గత రక్షణలో ఐపిఎస్ లు కెప్టెన్ లు అని తెలియజేశారు. శాంతి, భధ్రతల రక్షణలో శాంతి, సామరస్యాలు నెలకొల్పడంలో పోలీసులు, ఐపిఎస్ లు ఎన్నో త్యాగాలు, బలిదానాలు చేశారని, వారి స్ఫూర్తితో అంకిత భావంతో కృషిచేయాలన్నారు. అందరి హక్కులను కాపాడాలన్నారు. 

తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడి రాజా బహదూర్ వెంకట రామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న ఐపిఎస్ లు ధాత్రి రెడ్డి, రష్మి పెరుమాల్, సుధీర్ రాంనాధ్, అశోక్ కుమార్, అక్షాంశ్ యాదవ్ లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.అకాడమీ డైరెక్టర్ వి.వి. శ్రీనివాసకావు సమన్వయం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com