భాగ్యనగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత..

- August 17, 2020 , by Maagulf
భాగ్యనగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత..

హైదరాబాద్:భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు.వారి వద్ద నుంచి 250 కిలోల మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తుమందు ఏపీడ్రున్, కేటమైన్, మేపిడ్రీన్‌లను DRI( డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటిలిజెన్స్‌) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. DRI ఏక కాలంలో ముంబై, హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ముంబైకి కార్గో బస్సులో మత్తు మందు రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.DRI అధికారులు కార్గో బస్సుని వెంటాడి పట్టుకున్నారు.

హైదరాబాద్ లోని ఒక ఫార్మా కంపెనీ లో మత్తు మందు తయారీ అవుతున్న సమాచారాన్ని అందింది. ఈ సమాచారంతో అధికారులు దాడులు చేశారు.ఈ సోదాల్లో దాదాపు 100 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు DRI అధికారులు. 28 కోట్ల విలువైన 142 కిలోల మెఫిడ్రిన్‌ను, 50 కోట్ల విలువైన రా మెటిరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా మత్తుమందు ను సరఫరా చేసేందుకు డ్రగ్ మాఫియా వేసిన ప్లాన్‌ను అధికారులు రట్టు చేశారు. 2017 లో అరెస్ట్ అయిన డ్రగ్ డీలర్‌ను తిరిగి పట్టుకున్నారు. డ్రగ్స్‌తో రూ. 45 లక్షల నగదు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నగరంలో డ్రగ్స్ దందాపై అధికారులు డేగకన్నువేశారు. ఇప్పటికే ఎప్పటికప్పుడు పలుచోట్ల తనిఖీలు చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తుల్ని ముఠాలను అధికారులు అరెస్టులు చేస్తున్నారు. నగరంలో డ్రగ్ మాఫియా వ్యాపించకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌ డ్రగ్ కేసు కూడా సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com